![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -44 లో... సీతాకాంత్ ని పెళ్లి చేసుకోనని మాణిక్యానికి రామలక్ష్మి చెప్తుంది. ఎందుకు చేసుకోవని మాణిక్యం అనగానే.. ఎందుకు చేసుకోనో మీకు తెలియదా.. నా మనసులో ఎవరు ఉన్నారు.. అభి అని తెలియదా అని మాణిక్యంతో రామలక్ష్మి అంటుంది. మరొకవైపు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని అందుకు డబ్బులు సంపాదించే పనిలో అభి పడతాడు. ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతానని అభి అనుకుంటాడు.
నన్ను ప్రేమిస్తున్నానని అభి నీకు చెప్పినప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావ్ కదా అని రామలక్ష్మి అడుగుతుంది...అప్పుడు వాడు బ్రతిమిలాడాడు కాబట్టి అలా చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు సీతాకాంత్ ని పెళ్లి చేసుకుని తీరాలి. దీని వెనకాల బలమైన కారణం ఉంది. అది టైమ్ వచ్చినప్పుడు చెప్తానని మాణిక్యం అంటాడు. మరొకవైపు మాణిక్యం పెట్టిన కండిషన్ గురించి సీతాకాంత్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన తాతయ్య రామలక్ష్మి క్యాబ్ ఓనర్ ని తీసుకొని వస్తాడు అతను రామలక్ష్మి ఎలాంటిదో సీతకాంత్ కి చెప్తాడు. అతను రామలక్ష్మి గురించి గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి లెక్చరర్ ని రామలక్ష్మి గురించి సీతాకాంత్ కి తన గురించి చెప్పమని అడుగుతాడు. లెక్చరర్ కూడా రామలక్ష్మి చాలా మంచి అమ్మాయని చెప్తుంది.. చూసావా నువు రామలక్ష్మిని పూర్తిగా అపార్థం చేసుకున్నావని సీతాకాంత్ తో పెద్దాయన అంటాడు.
మరొకవైపు అభికి రామలక్ష్మి ఫోన్ చేస్తుంది. కాంట్రాక్ట్ పూర్తి అయ్యేదాకా ఇద్దరం మాట్లాడుకోవద్దు అనుకున్నాం కదా రామలక్ష్మి ఫోన్ చేస్తుందేంటని అభి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. రామలక్ష్మి జరుగుతున్న విషయాలన్నీ చెప్తుంది.ఆ తర్వాత మరుసటి రోజు రామలక్ష్మిని అభి కలిసి మాట్లాడతాడు.. ఆ తర్వాత ఇద్దరు మాణిక్యం దగ్గరికి వెళ్తారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని మాణిక్యాన్ని అభి అడుగుతాడు. మాణిక్యం మాత్రం అతను చెప్పింది వినిపించుకోడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |